Saturday, June 11, 2016

మనోడు!!

వేరే దేశం లో ఉంటే మన దేశం వాడే మనోడు
వేరే రాష్ట్రం లో ఉంటే మన రాష్ట్రo వాడే మనోడు
వేరే ఊరిలో ఉంటే మన ఊరివాడే మనోడు
వేరే ఏరియా లో ఉంటే మన ఏరియా వాడే మనోడు
వేరే వీధి లో ఉంటే మన వీధి వాడే మనోడు
వేరే మతం వాళ్ళు కూడా ఉన్నప్పుడు మన మతం వాడే మనోడు
వేరే కులం వాళ్ళు కూడా ఉన్నపుడు మన కులం వాడే మనోడు


మనోడు అంటే ...
మన దేశం వాడు కాదు
మన రాష్ట్రం వాడు కాదు
మన ఊరివాడు కాదు
మన ఏరియా వాడు కాదు
మన వీధి వాడు కాదు
మనం చుట్టం కాదు
మన కులం వాడు కాదు
మన మతం వాడు కాదు
మనోడు కాదు అనుకోబట్టే కదా ఇన్ని గొడవలు, యుద్ధాలు
అందరూ మన వాళ్ళే అనుకోవడం మాత్రం మన మనుషులకి రాదు....
ఈ విశ్వంలో మనం ఒంటరి వాళ్ళం, అయినా మారేదే లేదు!!!

Tuesday, December 16, 2014

వాళ్ళు.... !!!

పిల్లలు లేదు పెద్దలు లేదు అందరు ఒకటే వాళ్లకి
ఎల్లలు లేవు హద్దులు లేవు ఎక్కడైనా ఒకటే వాళ్లకి!!
ఏమి లాభమొస్తుంది ఇపుడు బిగిస్తే పిడికిళ్ళు
ఆ చేతులే పెంచి పోషించిన పాములు వాళ్ళు!!
వెనక్కి వస్తాయా పాములు కాటేసిన ప్రాణాలు
ఆగుతాయా అలసిపోని అమ్మల ఆర్తనాదాలు !!
తన వేలితో తన కంటినే పోడుచుకోవటం అంటే ఇదే
ఆ పైన కళ్ళు కనపడక బుద్ధి వస్తే మంచిదే!!


Tuesday, June 17, 2014

మనిషి!!

మతం కోసం మనిషిని చంపితే
కులం పేరుతో మనిషిని కొడితే 
పరువు కోసం మనిషిని పాతరేస్తే 
వృద్ధి కోసమని ప్రకృతిని తగలేస్తే
... దేవుడు సమ్మతిస్తాడా? సమ్మె చేస్తాడా??
ఈ ఘోరాలు చూడలేకనేనేమో ఒక్కోసారి
ఆకాశం ఆక్రందన చేస్తుంది!
భూమి భళ్లుమంటుంది!
గాలి హోరు పెంచుతుంది!
జలం సమాధులు కడుతుంది!